స్పీడ్‌ నెట్‌వర్క్‌ ఏదంటే ?

స్పీడ్‌ నెట్‌వర్క్‌ ఏదంటే ?

భారత్‌లో అత్యంత వేగమైన నెట్‌వర్క్‌ అందిస్తున్న సంస్థల జాబితను ‘ఊక్లా’ ప్రకటించింది. అత్యంత వేగమైన మొబైల్‌ నెట్‌వర్క్‌గా ‘భారతీ ఎయిర్‌టెల్‌’ నిలిచిందని స్పీడ్‌టెస్ట్‌ డేటా సేవలందించే సంస్థ ‘ఊక్లా’ పేర్కొంది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు సేకరించిన డేటా ప్రకారం ఎయిర్‌టెల్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. అలాగే ఐడియా, వోడా ఫోన్ కలిసిపోవడంతో డేటా వేగం పెరిగినట్టు వెల్లడించింది. నేషనల్ కాపిటల్ రీజన్ పరిధిలో అత్యంత వేగమైన 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌గా వొడాఫోన్‌ నిలిచినట్టు వివరించింది.

ఇక టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ విషయానికి వస్తే స్పీడ్ చాలా నెమ్మదిగా ఉందని తెలిపింది . అయితే ఊక్లా నివేదిక గతంలో టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపిన వివరాలకు విరుద్ధంగా ఉంది. బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌లో రిలయన్స్‌ జియో ప్రథమ స్థానంలో ఉందని ట్రాయ్ నివేదికలో పేర్కొనగా తాజాగా ఊక్లా మాత్రం ఎయిర్‌టెల్ ఉన్నట్లుగా తెలిపింది. మే నెల నుంచి ఎయిర్‌టెల్‌, జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ తగ్గిందని ‘ఊక్లా’ వివరించింది. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్,రిలయన్స్ జియో లాంటి నెట్ వర్క్ సంస్ధల బ్రాడ్‌బ్యాండ్ల పనితీరుపై ఓక్లా అధ్యయనం చేసింది. వొడాఫోన్‌, ఐడియా కలిసిపోవడంతో వాటి డౌన్‌లోడ్‌ స్పీడ్‌ పుంజుకుందని వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story