ఆ సంఘటన నన్ను చాలా బాధిస్తోంది.. ఇకనైనా మేల్కొందాం!

ఆ సంఘటన నన్ను చాలా బాధిస్తోంది.. ఇకనైనా మేల్కొందాం!

రాబోయే తరానికి ఆస్తిపాస్తులు ఇస్తే సరిపోవని.. ఆకుపచ్చని పర్యావరణాన్ని వారసత్వంగా అందించడమే లక్ష్యంగా వివిధ సదస్సులు తీర్మనాలు చేస్తుంటేకానీ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ పరిణామాలు పర్యావరణవేత్తలను ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా భూగోళానికి అధిక స్థాయిలో ప్రాణ‌వాయువును అందించే అమెజాన్ అడ‌వులు మంటల్లో దగ్ధమవడం ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తుంది. దక్షిణా అమెరికా ఖండంలోని ఈ అడవులు ఏటా హెక్టార్లాలో దగ్ధమవుతున్నాయి. ఇది సర్వత్రా ఆందోళన కలిగించే అంశం. ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు,శాస్త్ర‌వేత్త‌లు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ మ‌హేష్ బాబు కూడా స్పందించారు.

ప్రపంచానికి 20 శాతం ఆక్సిజ‌న్‌ని అందించే అమెజాన్ అడవులు మంట‌ల‌లో కాలిపోతున్నాయి. ఈ సంఘటన నన్ను కలిచివేసింది. భూగ్రహానికి ఊపరితిత్తులు లాంటి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ని కాపాడుకుందాం. ఇది ప్రతి ఒక్కరిని మేలుకొల్పే అంశం మన భూమిని రక్షించుకోవడానికి మన వంతు కృషి చేద్దాం. ఇది మన ఇంటి నుంచే ప్రారంభిద్దాం! ప్రే ఫర్ ది అమెజాన్ అంటూ ట్వీటర్ సందేశాన్ని పోస్ట్ చేశారు. దిశా ప‌ఠానీ, సాయిధ‌ర‌మ్ తేజ్, అనుష్క శ‌ర్మ‌, అర్జున్ క‌పూర్, లాంటి తారాలు కూడా అమెజాన్ అడ‌వుల‌ని కాపాడుకుందాం అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులను కోరారు

Tags

Read MoreRead Less
Next Story