అమరావతిలోనే రాజధాని: మంత్రి మేకపాటి

రాజధాని అమరావతిపై మళ్లీ రివర్స్ గేర్ వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో మంత్రులు తలోమాట మాట్లాడుతూ గందరగోళం రేపుతున్నారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు యథాలాపమన్న ఆర్థిక మంత్రి బుగ్గన.. నివేదిక వచ్చాకే తుది నిర్ణయమంటూ ముక్తాయింపు ఇచ్చారు. అటు.. అమరావతిలోనే రాజధాని అని మరో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తేల్చేశారు. రాజధాని తరలించే ఉద్దేశమే లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. బొత్స వ్యాఖ్యల్లో తప్పు లేదంటూనే ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. తాజాగా మంత్రి బొత్స 2009 నాటి వరద వస్తే పరిస్థితేంటంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధాని విషయంలో మంత్రులు, వైసీపీ ముఖ్య నేతల మాటలతో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైన గందరగోళం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com