జషిత్‌ కిడ్నాప్‌ కేసులో మరో ట్విస్ట్

జషిత్‌ కిడ్నాప్‌ కేసులో మరో ట్విస్ట్

తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన జషిత్ కిడ్నాప్ కేసులో మొదట్నుంచి అన్నీ ట్విస్టులే. ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు. ఎందుకు చేశారో తెలియదు. ముద్దులొలికే జషిత్ కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కిడ్నాప్ కేసుపైనే ఫోకస్ చేశారు. పోలీసుల అటెన్షన్ తో జాగ్రత్తపడిన కిడ్నాపర్లు జషిత్ ను గత నెల 25న కుతుకులూరు వద్ద వదిలివెళ్లిపోయారు.

జషిత్ క్షేమంగా తిరిగొచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అతన్ని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఈ ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు. కిడ్నాపర్లను వీలైనంత త్వరగా పట్టుకుంటామన్న పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేదు. అయితే.. ఇదే సమయంలో జషిత్ ను కిడ్నాప్ చేసింది తానే అంటూ.. పిల్లాడి తండ్రి వెంకటరమణరావుకు, అతని మేనమామ బెండి రామరాజుకు వచ్చిన ఫోన్ కాల్ అలజడి రేపింది. ఫస్ట్ టైం కిడ్నాప్ చేసినప్పుడు పిల్లాడ్ని ప్రాణాలతో వదిలిపెట్టానని.. కానీ, ఈ సారి అలా జరగదంటూ వార్నింగ్ ఇచ్చాడు. రూ. 50 వేలు ఇస్తే ఓకే లేదంటే జషిత్ ప్రాణాలు తీస్తానన్నాడు.

దీంతో కంగారుపడిపోయిన జషిత్ తండ్రి, అతని మేనమామ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేశారు. ఫోన్ లో డిమాండ్ చేసిన మేరకు 50 వేల రూపాయలు ఇస్తామని అతన్ని నమ్మించారు. డబ్బులు తీసుకునేందుకు మండపేట బైపాస్ రోడ్డు జంక్షన్ దగ్గరికి రమ్మని రూ.50 వేలు ఇచ్చారు. అప్పటికే మాటు వేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఫోన్ లో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి కిడ్నాపర్ ముఠాలోని వ్యక్తి కావొచ్చని భావించారంతా. స్టేషన్ కు తీసుకెళ్లి ఎంక్వైరీ చేసిన పోలీసులకు మరో ట్విస్ట్ ఎదురైంది. జషిత్ తండ్రికి ఫోన్ చేసిన వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాళ్లముదునూరిపాడుకు చెందిన చిక్కాల నరేష్ గా గుర్తించారు పోలీసులు. అయితే.. అతనికి జషిత్ కిడ్నాప్ కేసుకు ఏ సంబంధం లేదని నిర్ధారించుకున్నారు. పిల్లాడి కిడ్నాప్ వార్తలను పేపర్లు, టీవీల్లో చూసిన నరేష్.. డబ్బుల కోసమే జషిత్ తండ్రికి ఫోన్ చేసినట్లు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story