19 ఏళ్ళుగా పబ్లిక్ టాయిలెట్‌లోనే ఉంటూ..

మధురైకి చెందిన 65 ఏళ్ళ మహిళ గత 19 సంవత్సరాలుగా ప్లబిక్ టాయిలెట్‌లోనే ఉంటుంది. దాన్ని క్లీన్ చేస్తూ అక్కడికి వచ్చే వారు ఇచ్చే పైసలతో జీవితం గడిపెస్తోంది ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐఈ వృద్ధురాలు దుర్భర జీవితాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. కరుప్పై అనే మహిళ 19 ఏళ్ళుగా టాయిలెట్‌లో ఉంటుంది. దాన్ని వినియోగించుకునేవారు ఇచ్చే డబ్బులతో ఆమె బతుకీడుస్తోంది. ప్రతి రోజూ వచ్చే రూ.70 నుంచి రూ.80ల ఆదాయంతో అవసరాలను తీర్చుకుంటుంది. వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ తనకు పెన్షన్ రావడం లేదని వాపోయింది. తనకు ఒక కూతురు ఉంది కానీ ఆమె ఎప్పుడూ తనను చూసేందుకు రాలేదు అని చెబుతూ కరుప్పై కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె నివాసానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

