బైక్ మార్చి కారు కొనాలనుకుంటే ఇదే మంచి తరుణం.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు..

బైక్ మార్చి కారు కొనాలనుకుంటే ఇదే మంచి తరుణం.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు..

కారు కొనాలనే మీ కలను నిజం చేసుకోమంటున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. వినియోగదారుడిని ఆకర్షించడానికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. చిన్న కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకు అన్నింట్లో తగ్గింపే. ప్రస్తుతం ఆఫర్లు బ్రహ్మాండంగా ఉన్నాయని, ఇంతకు మించి ఇవ్వడం ఇకముందు సాధ్యం కాకపోవచ్చని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) డైరెక్టర్ నిఖంజ్ సంఘీ తెలిపారు. బేరమాడితే మరికొంత తగ్గే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఎందుకింత డిస్కౌంట్లు ఇస్తున్నాయో తెలుసుకుందామనుకుంటే..

కార్ల అమ్మకాలు ఆగిపోతే స్టాకులో ఉన్నవి పాతవాటికిందకు వస్తాయి. కొత్త వాహనాలన్నీ బీఎస్ 6 ప్రమాణాలతో తయారవ్వాలని ప్రభుత్వం నిబంధన విధించింది. పాత బీఎస్ 4 వాహనాలను వీలైనంత త్వరగా అమ్మాలని కంపెనీలు ఇలా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. విద్యుత్ బ్యాటరీ కార్లకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలిస్తోంది. వాహన రుణాల్లో వడ్డీ రేటు ఈమధ్యే 0.25 శాతం తగ్గించారు. ఈ అవకాశాన్ని వినియోగదార్లు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు డీలర్లు. ప్రస్తుతం అన్ని కంపెనీలు తగ్గింపునిస్తున్నాయి. దసరా, దీపావళి పండగ సమయాల్లోనూ ఇవి కొనసాగుతాయి. నగదు తగ్గింపు, ఎక్సేంజ్ ఆఫర్, విడిభాగాలపై రాయితీ, ఉచిత సర్వీసింగ్, ఉచిత నిర్వహణ, ఉద్యోగులకు ప్రత్యేక తగ్గింపులు, బోనస్‌లు, గోల్డ్ కాయిన్ ఇలా వివిధ రకాల ఆఫర్ల ద్వారా కొన్ని మోడళ్లపై ప్రస్తుతం తగ్గించిన ధరలివి.

హోండా సీఆర్-వీ- రూ. 4 లక్షలు... స్కోడా కోడియాక్- రూ.2.75 లక్షలు, హ్యుందాయ్ ఎలాంత్రా-రూ.2 లక్షలు, టయోటా ఇన్నోవా- రూ.1.95 లక్షలు, ఫోక్స్‌వాగన్ టిగువాన్-రూ.1.75 లక్షలు, టయోటా ఫార్చునర్-రూ.1.2 లక్షలు, హ్యుందాయ్ ఐ10-రూ.95 వేలు. స్విప్ట్ డిజైర్- రూ.74 వేలు, మహీంద్రా కేయూవీ 100- రూ.73 వేలు, మహీంద్రా టీయూవీ 300- రూ.72 వేలు, మారుతీ సియాజ్- రూ.70 వేలు, డాట్సన్ రెడి-గో-రూ.65వేలు, మారుతీ సెలేరియా (సీఎన్‌జీ)-రూ.57వేలు, నిస్సాన్ కిక్స్- రూ.35 వేలు. ఇక టాటా మోటార్ టాటా నెక్సాన్, టియాగో, హెక్సా మోడళ్లపై 3+3+3+ అనే ఆఫర్ ఇస్తోంది. మూడేళ్ల ఉచిత సర్వీసింగ్, వార్షిక నిర్వహణ ప్యాకేజీ, వీటితో పాటు ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.30 వేల వరకు తగ్గింపునిస్తున్నారు. మూడు గ్రాముల బంగారు నాణెం కూడా ఇస్తున్నారు. హీరో మోటోకార్స్ స్కూటర్లపై రూ.4 వేల వరకు నగదు తగ్గింపు ప్రకటించింది. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ ఎంపిక చేసిన రాష్ట్రాల్లో జీరో వడ్డీరేటుతో రుణాలు అందిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story