బస్సు డ్రైవర్‌పై మందుబాబు దాడి

బస్సు డ్రైవర్‌పై మందుబాబు దాడి
X

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బస్‌ స్టేషన్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. కరీంనగర్‌కు వెళ్లే బస్సు డ్రైవర్‌ లచ్చన్నపై దాడికి దిగాడు. అసభ్య పదజాలంతో దూషిస్తు డ్రైవర్‌ సీటులో నుంచి అతన్ని కిందకులాగి దాడికి తెగబడ్డాడు. నోట్లో నుంచి రక్తం వచ్చేలా కొట్టాడు. ప్రయాణికులు మందుబాబుకు నచ్చ జెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. చివరికి స్థానికులంతా కలిసి ఆయువకుడికి దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు.

Subscribe to TV5 Tollywood : http://bit.ly/2KRNtxb

Tags

Next Story