రోడ్డుపై వెళ్తున్న యువతిని నడుం పట్టుకుని లాగిన యువకులు

రోడ్డుపై వెళ్తున్న యువతిని నడుం పట్టుకుని లాగిన యువకులు

రోడ్డుపై వెళ్తున్న యువతిని నడుము పట్టుకుని లాగారు ముగ్గురు యువకులు. బైక్‌పై కొంతదూరం లాక్కెళ్లారు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో.. స్థానికులు అప్రమత్తం అయ్యారు. విషయం గ్రహించిన ఆ ముగ్గురు దుర్మార్గులు.. ఆమెను విడిచిపెట్టి పరారయ్యారు. అయితే.. స్థానికులు వాళ్ల బైక్‌ను వెంబడించారు. ముగ్గురినీ పట్టుకుని చితకబాదారు.

నెల్లూరు జిల్లా చేజెర్ల సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఒళ్లు మరిచిపోయిన ముగ్గురు యువకులు.. సినీ ఫక్కీలో యువతిని వేధించారు. బైక్‌పై పారిపోతుండగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. చితక్కొట్టి.. పోలీసులకు అప్పగించారు. మరోసారి ఇలా చేయకుండా గట్టి బుద్ధి చెప్పాలని స్థానికులు కోరారు.

Read MoreRead Less
Next Story