జైట్లీ ఇకలేరన్న వార్త ఎంతో బాధకు గురిచేస్తోంది : ప్రధాని మోదీ

బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. జైట్లీ ఇకలేరనే వార్త తనను ఎంతో బాధకు గురిచేసిందని... గొప్ప వ్యక్తుల్లో జైట్లీ ఒకరని. ఎంతో కాలంగా ఇద్దరం కలిసి ప్రజాసేవలో ఉన్నామని చెప్పారు. జైట్లీ రాజకీయ జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులను సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి జైట్లీ అన్నారు. సమస్యను వెంటనే అర్థం చేసుకుని పరిష్కరించగల మేధావి అని కొనియాడారు. దేశ చరిత్ర, న్యాయశాస్త్రం, పరిపాలన, ప్రజా విధానం వంటి అంశాలపై ఆయనకున్న పట్టు వర్ణించలేదని. సమర్థవంతమైన నేతను కోల్పోయాం. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్విటర్‌లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com