డబ్బులు తీసుకుని అర్హత లేనివారిని టోర్నమెంట్‌లో సెలక్ట్ చేశారంటూ..

డబ్బులు తీసుకుని అర్హత లేనివారిని టోర్నమెంట్‌లో సెలక్ట్ చేశారంటూ..
X

ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఇంటర్‌ నేషనల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో డబ్బులు తీసుకొని అర్హత లేనివారిని టోర్నమెంట్‌లో సెలక్ట్ చేశారంటూ క్రీడాకారుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. టోర్నమెంట్‌లో సెలక్ట్‌ అయిన తమ కుమారుడు కార్తికేయను చివరి క్షణంలో పోటీల నుంచి నిర్వాహకులు తప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు తప్పించారంటూ ప్రశ్నించినందుకు సెలక్టర్‌ శివారెడ్డి తమపై దాడులకు దిగారని క్రీడాకారుడి తల్లిదండ్రులు మండిపడ్డారు . సైఫాబాద్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కార్తికేయ తల్లిదండ్రులను సెలక్షన్‌ కమిటీ నిర్వహకులు బెందిరించారు. ఇకపై కార్తీకేయకు అవకాశాలు కల్పించమంటూ హెచ్చరించారు.

Tags

Next Story