ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, నాయిని నర్సింహారెడ్డి అల్లుడు మధ్య కోల్డ్‌వార్‌..

ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, నాయిని నర్సింహారెడ్డి అల్లుడు మధ్య కోల్డ్‌వార్‌..

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, నాయిని నర్సింహారెడ్డి అల్లుడు, రాంనగర్‌ కార్పోరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి మధ్య ఇన్ని రోజులు సాగిన కోల్డ్‌వార్‌.. రాం నగర్‌ డివిజన్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో బహిర్గతమైంది. తన వర్గీయుడికే అధ్యక్ష పదవి ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, కార్పోరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఎవరికి వారు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాలు బాహాబాహికి దిగడంతో డివిజన్‌ అధ్యక్ష ఎన్నిక రసాభాసగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ సభ మధ్యలోనుంచే వెను దిరిగారు.

Tags

Read MoreRead Less
Next Story