'ఇకపై రాష్ట్రానికి నాలుగు రాజధానులు'

X
ఏపీ రాజధానిపై ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాష్ట్రానికి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయని చెప్పారు. రాజధాని అంశంపై జగన్ బీజేపీతో చర్చించారని, పార్టీ హైకమాండ్ తమకు ఈ విషయం చెప్పిందని అన్నారు. త్వరలోనే విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాలు ఏపీకి రాజధానులుగా ఉంటాయని అన్నారు.
ఇది నూటికి నూరు శాతం జరిగి తీరుతుందని కూడా కామెంట్ చేశారు. రాజధానిపై ఇప్పటికే మంత్రి బొత్స వ్యాఖ్యలతో గందరగోళం నెలకొనగా.. ఇప్పుడు బీజేపీ ఎంపీ టీజీ మరో సంచలన ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బీజేపీ అధ్యక్షుడ కన్నా రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్తుంటే.. ఢిల్లీ నుంచి తమకు ఉన్న సమాచారం ప్రకారం ఇకపై ఏపీలో నాలుగు రాజధానులు ఉంటాయని టీజీ అంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
