పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించడంపై రాష్ట్రపతి, ప్రధాని హర్షం

X
పీవీ సింధు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో ఆమె కుటుంబసభ్యులు, బంధుమిత్రుల్లో సంతోషం పొంగి పొర్లింది. సింధు కుటుంబసభ్యులు స్వీట్లు పంచుకొని, శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ప్రపంచ చాంపియన్ షిప్ టైటిల్ కోసం సింధూ 6 నెలలుగా సాధన చేస్తోందని ఆమె తల్లి విజయ తెలిపారు. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ షట్లర్‌పై గెలవడం టర్నింగ్ పాయింట్ అన్నారు.
గోల్డ్ మెడల్ సాధించడంపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని దీవించారు. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు కూడా సింధూను ప్రశంసల్లో ముంచెత్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
