చరిత్ర సృష్టించిన షట్లర్ పీవీ సింధు

చరిత్ర సృష్టించిన షట్లర్ పీవీ సింధు
X

హైదరాబాద్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచిన తొలి ఇండియన్‌గా నిలిచింది.. ఫైనల్లో జపాన్‌ ప్లేయర్ ఒకుహరపై రెండు వరుస సెట్లలో గెలిచింది..2017లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. 2017లో ఒకుహర చేతిలోనే ఓడిపోయి స్వర్ణాన్ని చేజార్చుకుంది పీవీ సింధు. ఫైనల్లో సింధు చిరుతపులిలా చెలరేగి పోయింది. ఆమె దూకుడు ముందు ఒకుహర నిలువలేకపోయింది. అసలు ఏదశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.. 21-7తేడాతో తొలిసెట్ గెలిచిన సింధు.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది..రెండో సెట్‌ను కూడా 21-7తేడాతో గెలుపొందింది.

Tags

Next Story