మంత్రి బొత్స వ్యాఖ్యలపై సర్వత్రా ఆందోళనలు.. రైతుల ధర్నా తీవ్ర రూపం

మంత్రి బొత్స వ్యాఖ్యలపై సర్వత్రా ఆందోళనలు.. రైతుల ధర్నా తీవ్ర రూపం
X

రాజధానిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు ధర్నాకు దిగారు. మంగళగిరి మండలం కృష్ణపాలెం వద్ద రైతులు రెండు రోజులుగా ధర్నా చేపడుతున్నారు. అటు వెంకటపాలెం, మందడం ప్రాంతాల్లోనూ రైతుల ధర్నా తీవ్ర రూపం దాల్చుతోంది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారా లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Next Story