ఆంధ్రప్రదేశ్

వైసీపీ వందరోజుల పాలనా, వైఫల్యాలపై పుస్తకం రిలీజ్‌ చేయనున్న టీడీపీ

రాజధాని భూముల వ్యవహారంపై ఉద్ధృతంగా పోరాటం చేయాలని నిర్ణయించింది టీడీపీ. ఇందుకోసం కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని నిర్ణయించింది. రాజధాని రైతుల అంశంపై పలువురు పార్టీ సీనియర్లతో చర్చలు జరిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. అన్ని పార్టీలను ఒక్క తాటిపై తీసుకొచ్చేందుకు సీనియర్లతో ఓ కమిటీ కూడా వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో రాజధాని భూములతో పాటు అనేక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, అందులో ఎలాంటి అవినీతి లేదని స్పష్టం చేశారు చంద్రబాబు. అవినీతి వెతికినా దొరదన్నారాయన. అవినీతి ఉందంటూ జగన్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారాయన. హైదరాబాద్‌ గ్రౌండ్‌ ఫీల్డ్‌ అయితే.. అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ అన్నారు చంద్రబాబు.

ఇక ప్రభుత్వం వంద రోజుల పాలనా, వైఫల్యాలపై ఒక పుస్తకం కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. మరోవైపు.. ఉపాధిహామీ బిల్లులను నిలుపుదల చేయడంపైనా గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు.

Next Story

RELATED STORIES