తీహార్ జైలుకు చిదంబరం.. పరుపు లేకుండా మంచం..

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీహార్ జైలుకు వెళ్లక తప్పలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. చిదంబరానికి ప్రస్తుతం సీబీఐ కష్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే తీహార్ జైల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో చిదంబరం ఉంటున్నారు. సీబీఐ రిమాండ్ ముగిసింది. ఆయనకు బెయిల్ రాకపోవడంతో తీహార్ జైలుకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెంబర్ 7ను కేటాయించబోతున్నారు. ఇందులో ఆర్ధిక నేరగాళ్లు ఉంటారు. మిగతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని.. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అతనికి సౌత్ ఇండియా ఫుడ్ కావాలంటే సెపరేట్‌గా స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని అది కూడా కోర్టు ఆర్డర్ ప్రకారమని చెబుతున్నారు.
జైల్లో చిదంబరంకు మంచం అది కూడా పరుపు లేకుండా ఉండేది మాత్రమే ఇస్తామంటున్నారు జైలు అధికారులు. సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఇటువంటివి ఉంటాయంటున్నారు. మిగతా వారు అయితే కింద పడుకోవాల్సిందేనని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com