పది, ఇంటర్ పాసైతే స్పైస్ జెట్‌లో ఉద్యోగాలు.. ఎప్పుడైనా అప్లై..

పది, ఇంటర్ పాసైతే స్పైస్ జెట్‌లో ఉద్యోగాలు.. ఎప్పుడైనా అప్లై..

భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లో స్పైస్ జెట్ ఒకటి. ఈ సంస్థలో నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. ఇందులోని ఇన్‌ప్లైట్ సర్వీసెస్ విభాగంలో క్యాబిన్ క్రూ లేదా ప్లైట్ అటెండెంట్ పోస్టులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లైట్‌లో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడంతో పాటు వారికి సేవలు అందించాల్సి వుంటుంది ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు. పెళ్లికాని అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తిగల అమ్మాయిలు స్పైస్ జెట్ అధికారిక వెబ్‌సైట్ https://www.spicejet.com ఓపెన్ చేసి Careers సెక్షన్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు స్పైస్‌జెట్.. అభ్యర్థులకు సమాచారం అందిస్తుంది. రీసెంట్ రెజ్యూమెతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఫుల్ సైజ్ ఫార్మల్ డ్రెస్ వేసుకున్న ఫోటో ఒకటి అప్‌లోడ్ చేయాలి. ఆధార్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ కాపీలను అప్‌లోడ్ చేయాలి. జాబ్: క్యాబిన్ క్రూ లేదా ప్లైట్ అటెండెంట్, విద్యార్హత: 10+2 పాసైనవాళ్లు, వయసు 18 నుంచి 27 ఏళ్లు (క్యాబిన్ క్రూ అనుభవం ఉన్న వారికి వయసులో సడలింపు ఉంటుంది) ఎత్తు కనీసం 155 సెంటీమీటర్లు, హిందీ, ఇంగ్లీష్ భాషలో రాయడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి నియామకాలు ఉన్నా స్పైస్ జెట్ వెబ్‌సైట్ ద్వారానే దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. డబ్బు తీసుకుని సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని స్పైస్ జెట్ చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story