ఆంధ్రప్రదేశ్

గుడి వద్ద తల్లీకూతుళ్లను దారుణంగా..

గుడి వద్ద తల్లీకూతుళ్లను దారుణంగా..
X

తూర్పుగోదావరి జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. రామచంద్రాపురం పట్టణం గంగమ్మ గుడి వద్ద తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. సుత్తితో బలంగా కొట్టి వారిద్దరినీ చంపినట్లు అనుమానిస్తు న్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యలకు కారణాలను ‌అన్వేషిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించాయి.

బలస మాధవి దంపతులు తమ ఇద్దరు బిడ్డలతో గంగమ్మ గుడి వద్ద నివాసముంటున్నారు. మాధవి భర్త ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి మాధవి, ఆమె కుమార్తె బలస కరుణపై ఆగంతకులు దాడి చేశారు. కిరాతకంగా తలపై గట్టిగా కొట్టి హతమార్చారు. రక్తపు మరకలను చూసిన స్థానికులు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్పీ నయీమ్, ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.

Next Story

RELATED STORIES