అంతర్జాతీయం

హెచ్చరిక.. 48 గంటల్లో తీవ్రమైన తుఫాన్

హెచ్చరిక.. 48 గంటల్లో  తీవ్రమైన తుఫాన్
X

నార్త్ కరోలినా వాసులకు అమెరికా వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీచేసింది. వచ్చే 48 గంటల్లో తీవ్రమైన తుఫాన్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో నార్త్ కరోలినా, హట్టరాస్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ హరికెన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం ముందుకు కదులుతూ ఈశాన్యం వైపు పయనిస్తుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది తుఫాన్ ను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Next Story

RELATED STORIES