ప్రభాస్ ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

ప్రభాస్ ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ
X

రామ్ గోపాల్ వర్మ .. నాటు సారా తాగేవాడికి ఫారిన్ మందు దొరికితే ఎంత కిక్ గా ఫీలవుతాడో.. తన ఘాటు కమెంట్స్ తో సొసైటీలో అంతా తన గురించే మాట్లాడుకుంటుంటే రామ్ గోపాల్ వర్మకు అంత కిక్. ఎవ్వరినీ లెక్క చేయడు, భయం లేదు. నోటికి ఏది తోస్తే అది ట్వీటడం అతని శైలి. ఆర్టిస్టుల నుంచి పొలిటీషియన్స్ వరకూ.. సోషల్ ఇష్యూస్ నుంచి టాప్ సెలబ్రిటీస్ వరకూ అతను కెలకని వారు లేరు.. అలాంటి వర్మ ఈ సారి ప్రభాస్ పై పడ్డాడు. సాహో కోసం తను కళ్లు వాచిపోయేలా చూస్తున్నాను అన్నాడు. మరి ఇంత వరకే అని ఊరుకుంటే అతను వర్మ ఎందుకవుతాడు..?

నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అందుకనే రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే ప్రభాస్ నా క్యాస్ట్ కాబట్టి.. ఈ సందర్భంగా నా నెక్ట్స్ సినిమా కమ్మరాజ్యంలో కడపరెడ్లు లోని ఒక పాటని 27వ తారీఖు ఉదయం 9గంటల 27 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేయబోతున్నాం.. ఇదీ రామ్ గోపాల్ వర్మ పెట్టిన వాయిస్ మెసేజ్.. మొత్తంగా వర్మకు వోడ్కా లేకుండా అయినా ఉండగలడేమో కానీ కాంట్రవర్శీ లేకుంటే కడుపు నిండదు. ఏది హాట్ టాపిక్ అయితే దాంట్లో ట్వీటు పెట్టడం.. రచ్చ చేయడం మనోడి స్పెషాలిటీ. చాలామంది సెలబ్రెటీస్ చూసి చూడనట్టు వదిలేస్తారు. మరీ శృతి మించితే నాగబాబులా బుసలు కొడతారు. అఫ్ కోర్స్ వాటిని కూడా ఇతను లైట్ గానే తీసుకుంటాడు. ఇప్పటికే దర్శకుడుగా పూర్తిగా ఫామ్ కోల్పోయిన వర్మ.. ఇలా మాటలతో మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.. ఉంటాడు కూడా.

మామూలుగా చూస్తే ఈ ట్వీట్ లో కాస్త ఫన్ కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే అటు ప్రభాస్ కు, అతని హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఇతను కులం రంగు పులుముతున్నాడు అని అర్థమౌతుంది. కులం బలం వల్లే ప్రభాస్ నిలబడ్డాడు.. నిలబడతాడు అని చెప్పండం అతని ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. ఇది తన సినిమా కమ్మరాజ్యంలో కడపరెడ్లుకు ఉపయోగపడుతుంది కూడా. ఎందుకంటే క్యాస్ట్ యాంగిల్ లో సినిమా ఎందుకు తీస్తున్నావు అని ఎవరైనా అడిగితే మీ క్యాస్ట్ వాళ్ల సినిమాలే మీరు చూస్తున్నారు కదా అనొచ్చు. అదే సమయంలో తను కోరుకు ఫ్రీ పబ్లిసిటీ కూడా పొందొచ్చు.

కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అంటూ అత్యంత కాంట్రవర్శీయల్ టైటిల్ తో రచ్చ చేయడానికి రెడీగా ఉన్నాడు. రీసెంట్ గా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుందో గెస్ చేయండి అంటూ మరోసారి తన కాంట్రవర్శీ బుద్ధి చాటుకున్న అతను అంతకు ముందే ఓ పాటను కూడా విడుదల చేసి షాక్ ఇచ్చాడు. ఇప్పుడీ సినిమాలో రెండో పాటను ఈ నెల 27న బ్రహ్మముహూర్తంలో విడుదల చేయబోతున్నా అంటున్నాడు. వర్మ తాను దేవుణ్ని నమ్మను అని చెబుతాడు. మరి ఈ బ్రహ్మముహూర్తం అనే మాట ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలుగు సినిమాలు చూసేవారికి, తెలుగుదేశం రాజకీయాలు ఫాలో అయ్యేవాళ్లందరికీ ఈజీగా అర్థమౌతుంది. మొత్తంగా ఇప్పుడు ప్రభాస్ పై అతను చేసిన హాట్ కమెంట్స్ పరిణామం ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Next Story