చెవిలో దూరిన సాలీడు.. తెల్లవార్లూ..

చెవిలో ఏదైనా దూరితే అది తీసిందాకా నిద్రపట్టదు. మరి అలాంటిది ఏకంగా ఒక సాలీడే చెవిలో తిష్టేసింది. అది కూడా భయంకరమైన విషం చిమ్మే సాలీడు. కన్నాట్ సిటీ మస్సోరీకి చెందిన సుషే టోరీస్ అనే మహిళ చెవి ఒకటే దురద. తెల్లవార్లు నిద్ర పోకుండా ఎన్నో ప్రయత్నాలు చేసింది. దురద ఏ మాత్రం తగ్గకపోగా మరింత ఎక్కువైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. దురద భరించలేక డాక్టర్ దగ్గరకు వెళితే ఏదో పురుగు ఉందనైతే చెప్పగలిగారు. కానీ అది ఏంటి అనేది నిర్ధారించలేకపోయారు. టెస్టులన్నీ చేసిన తరువాత కానీ చెవిలో ఉన్నది సాలీడని తెలుసుకోలేకపోయారు. అది కూడా విషపూరితమైన సాలీడని చెప్పారు. అదృష్టవశాత్తు సాలీడు ఆమెను కుట్టలేదు. ఒకవేళ కుట్టి వుంటే ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. ఈ సాలీడు కుడితే వికారం, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని దీన్ని వైద్య పరిభాషలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అందుకే నిద్రించే సమయంలో చెవిలో దూది పెట్టుకుని పడుకోవడం అన్ని విధాల శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com