వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే ఊరుకునేది లేదు : మాజీ ఎమ్మెల్యే

X
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడుతున్నారని ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ఆరోపించారు. ఒంగోలులో టీడీపీ నగర అధ్యక్షుడిపై వైసీపీ కార్యకర్తలు దాడిని ఆయన ఖండించారు. కొఠారి నాగేశ్వరరావును తీవ్రంగా గాయపర్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా ఎస్పి శిద్దార్థ్ కౌశల్‌ను కలిసి వినతి పత్రం అందించారు. కక్ష పూరిత రాజకీయాలకు మంత్రి కొడుకు స్వస్తి పలకాలని.. లేకుంటే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే తాము ఇక చూస్తూ ఊరుకునేది లేదని దామచర్ల హెచ్చరించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
