కులపిచ్చి నాకూ ఉంది - వర్మ

కులపిచ్చి నాకూ ఉంది - వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాలతో టన్నుల కొద్దీ వివాదాలను మూటగట్టుకున్న వర్మ.. తాజాగా కులాల పంచాయితీకి ఆజ్యం పోస్తున్నారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులోని మొదటిపాట ఇప్పటికే కాంట్రావర్సీ అయ్యింది. ఇదే సినిమాకు సంబంధించి రెండో పాటను రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. కులాలపై తన అభిప్రాయం మారిందని.. కులపిచ్చి తనకూ ఉందంటూ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ పాట.. నెట్ లో హల్ చల్ చేస్తోంది. కులాల పేర్లతో నేరుగా పాట రాసి.. తానే సొంతంగా పాడారు వర్మ.

Tags

Read MoreRead Less
Next Story