మరోసారి వక్రబుద్ధి చూపించిన పాకిస్థాన్

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. నేరుగా మనదేశాన్ని ఎదుర్కొనే సత్తాలేని పాక్, దొంగ దెబ్బలతో భయపెట్టాలని చూస్తోంది. తాజాగా నీటి విషయంలో పాక్ ప్రభుత్వం కయ్యానికి దిగింది. సట్లెజ్ నదిపై నిర్మించిన ప్రాజెక్టు గేట్లను ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఎత్తేసింది. ఆకస్మికంగా గేట్లు ఎత్తేయడంతో వరద నీరు మనదేశంలోకి పోటెత్తింది. భారత్-పాక్ సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌ను వరద నీరు ముంచేసింది. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని పలు గ్రామాలు వరదముంపులో చిక్కుకున్నాయి. తెండీవాలా గ్రామం వద్ద ఉన్న కరకట్ట తీవ్రంగా దెబ్బతింది.
సట్లెజ్ నది నీరు పోటెత్తడంతో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫిరోజ్‌పూర్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఆర్మీ, వైమానిక, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. వరద బాధితుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. రోగాలు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సట్లెజ్ నది నీటితో ఆటలాడడం పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. ఇలాంటి దుశ్చర్యలు గతంలోనూ జరిగాయి. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే పలుసార్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com