జూడాలపై రోగి బంధువుల దాడి

జూడాలపై రోగి బంధువుల దాడి

ఆస్పత్రుల్లో డాక్టర్లపై దాడులు ఆగడం లేదు. ఈ మధ్య చూసిన వరుస ఘటనల్లో వివాదం సమసిపోకముందే.. తాజాగా హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌పై పేషంట్‌ బంధువులు దాడి కలకలం రేపుతోంది. పేషంట్‌ బెడ్‌ మీద ఉన్న బ్యాగు తీసి పక్కకు పెట్టారన్న ఆగ్రహంతో రోగి బంధువులు జూనియర్‌ డాక్టర్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. నానా దుర్భాషలాడారు. వేరే పేషంట్స్ రావడంతో బ్యాగ్‌ తీశామని.. అకారణంగా తనపై దాడి చేయడంపై జూనియర్‌ డాక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సీరియస్‌ అయిన నీలోఫర్‌ హెచ్‌వోడీ.. నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న వైద్యుడిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story