తెలుగు సినిమాకు ఇంత దమ్ముందా? నెల రోజుల్లో ఎన్ని వందల కోట్ల బిజినెస్సో తెలుసా?

తెలుగు సినిమాకు ఇంత దమ్ముందా? నెల రోజుల్లో  ఎన్ని వందల కోట్ల బిజినెస్సో తెలుసా?

తెలుగు సినిమా.. ఒకప్పుడు ఇది ప్రాంతీయ భాషా సినిమా. కానీ ఇప్పుడు తెలుగు పరిశ్రమ నుంచి ఓ సినిమా వస్తోందంటే దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. కంటెంట్ నుంచి క్వాలిటీ వరకూ.. విజువల్ ఎఫెక్ట్స్ నుంచి గ్రాఫిక్స్ వరకూ మన సినిమా మరో స్థాయికి చేరింది. అందుకు మగధీర మొదలుపెడితే.. ఈగ ఇంట్రెస్ట్ ను పెంచింది. బాహుబలి బెంచ్ మార్క్ అయింది. ఆ రేంజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే, కేవలం నెల రోజుల్లోనే తెలుగు సినిమా నుంచి ఏకంగా ఆరువందల కోట్ల బిజినెస్ జరగబోతోంది. అది కూడా కేవలం రెండు సినిమాలతో. యస్. సాహో అండ్ సైరా. ఈ సినిమాలు బిగ్గెస్ట్ హిట్ గా నిలిస్తే.. బాక్సాఫీస్ వణికిపోక తప్పదు.తెలుగు సినిమా స్థాయిని సాహో, సైరా మరింతగా పెంచబోతున్నయా? అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story