ముగ్గురు కొడుకుల మృతితో శోకసంద్రంలో తల్లిదండ్రులు

ముగ్గురు ఒకే తల్లి బిడ్డలు. సరదాగా చెరువు గట్టుకుపోయారు. సంతోషంగా ఆడుకుంటున్న అన్నాతమ్ముళ్లలో.. ఒకరు సడెన్‌గా చెరువులో కాలు జారిపడిపోయాడు. తమ్మున్ని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు చిన్నారులు కూడా చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన అందరిని కలచి వేసింది.తమ ముగ్గురు కుమారులు ఇక లేరని తెలిసి ఆ తల్లిదండ్రులు రోదనలు వర్ణణాతీతంగా మారాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుమున్నాయి. తల్లిదండ్రులు పని కోసం సుదూర ప్రాంతానికి వెళ్లిపోయిన సమయంలో... ఎవరూ గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Tags

Next Story