వణుకు పుట్టిస్తున్న క్షిపణి పరీక్షలు.. రంగంలోకి ఐరాస

వణుకు పుట్టిస్తున్న క్షిపణి పరీక్షలు.. రంగంలోకి  ఐరాస

క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఉత్తర కొరియా ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నడుం బిగించింది. దక్షిణ కొరియా- అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్... ఈ మధ్య క్షిపణి ప్రయోగాలను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తర కొరియా ఆయుధ ప్రయోగాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు భద్రతా మండలికి విజ్ఞప్తి చేశాయి. ఒక్క నెలలోనే ఆరు క్షిపణి ప్రయోగాలను నిర్వహించినట్లు ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో నార్త్ కొరియా అంశాన్ని చర్చించేందుకు మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story