నాలుగు నెలల్లో ఏదైనా జరగొచ్చు - ప్రభాస్

నాలుగు నెలల్లో ఏదైనా జరగొచ్చు - ప్రభాస్

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం ఇప్పుడు ట్రెడింగ్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తాను నటించిన సాహో చిత్ర ప్రమోషన్లో ఉన్న ప్రభాస్‌కి ఎక్కడికి వెళ్లినా పెళ్లి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. తాజాగా టీవీ5కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నను సంధించగా ప్రభాస్ ..పెళ్లిపై కొంత క్లారిటీ ఇచ్చాడు. పెళ్లిపై మీ ఒపీనియన్ ఏంటి అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ .. అది జీవితంలో ఓ అందమైన అనుభూతి అన్నారు. మీ వివాహానికి స్వయంవరంలాంటివి ఏవైనా ఏర్పాట్లు చేసే ఆలోచనలో ఉన్నారా అంటే.. అలాంటి సంస్కృతి ఇప్పుడు లేదు. నా పెళ్లి చాలా సింపుల్‌గా జరుగుతుందంటూ బదులిచ్చారు. 2019 లో మీరు సింగిల్‌గానే ఉంటారా అని పెళ్లి గురించి పరోక్షంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ". దాని గురించి మీరు ముందే ఎలా డిసైడ్ అవుతారు..4 నెలల్లో ఏదైనా జరగొచ్చు" అంటూ ప్రభాస్ పెళ్లిపై కొంత క్లారిటీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story