దోమ కుట్టింది.. గుండె ఆగింది..

దోమ కుట్టింది.. గుండె ఆగింది..

అప్పుడే నిద్ర పడుతుందనుకుంటే అంతలోనే చెవిలో దోమలు గుయ్ మంటూ సొద పెడుతుంటాయి. ఎక్కడ కుడతాయో అని చచ్చేంత భయం. ఏ దోమ కుడితే ఏ జ్వరాలు వస్తాయో అని అర్థరాత్రి అయినా దోమల బ్యాట్ పట్టుకుని హంతకులుగా మారాల్సిందే. సాధారణంగా దోమలు కుడితే శరీరంపై దద్దుర్లు వస్తాయి. కాసేపటికి అవి తగ్గిపోతాయి. కానీ ఓ మహిళకు కుట్టిన దోమ వల్ల 3 నెలలు హాస్పిటల్ బెడ్‌పైనే ఉంది. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌లో నివసించే కిమ్ రాబిన్సన్ తన తోటలో పని చేసుకుంటోంది. ఆ సమయంలో కాలి మడమ దగ్గర దోమ కుట్టింది. కొద్ది సేపటికి బాగా దురదగా అనిపించడంతో నీటితో కడిగింది. తరువాతి రోజు చూస్తే దోమ కుట్టిన ప్రాంతం అంతా వాచి పోయింది. నడవడానికి క్కూడా చాలా ఇబ్బంది పడింది.

దోమ కుట్టిన ప్రాంతం నల్లని పుండులా తయారవడంతో హాస్పిటల్‌కు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. కాలికి నెక్రోటైజింగ్ ఫాసిటిస్ అనే వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఈ వ్యాధి సోకిన వారి చర్మన్ని బ్యాక్టీరియా తినేస్తుందని, వెంటనే ఆ భాగాన్ని తొలగించకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. సర్జరీ చేస్తున్న సమయంలో ఆమె పరిస్థితి మరింత విషమంగా మారింది. గుండె, ఊపిరితిత్తులు పనిచేయడం మానేశాయి. దాంతో వైద్యులు కొద్దిసేపు ఆపరేషన్ చేయడం ఆపి గుండె పనితీరును మెరుగు పరిచారు. మూడు నిమిషాల తరువాత గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. చికిత్స అనంతరం స్పృహలోకి రాలేదు. ఐదు రోజుల పాటు కోమాలో ఉండిపోయింది. తెలివి వచ్చిన తరువాత కూడా మాట్లాడలేకపోయింది. నడవడం కష్టమైపోయింది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె మూడు నెలల తరువాత కానీ సాధారణ స్థితికి చేరుకోలేకపోయింది.

Tags

Read MoreRead Less
Next Story