నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది..

నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది..

విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో నడిరోడ్డుపై విద్యార్థిని గొంతు కోశాడు. అనకాపల్లిలోని రామచంద్ర థియేటర్ దగ్గర ఈ దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే స్క్రూడ్రైవర్‌తో గొంతు కోశాడు ప్రేమోన్మాది సాయి. ఈ దాడితో భార్గవి రోడ్డుపైనే కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

యశోద భార్గవి అనే యువతి డీవీఎన్‌ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. సాయి అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమె వెంట పడుతున్నాడు. కానీ భార్గవి అందుకు అంగీకరించలేదు. ప్రేమను నిరాకరించడంతో ఆమె మీద పగ పెంచుకున్నాడు. తనకు దక్కని యువతి మరెవరికి దక్కకూడదని భావించాడు.

భార్గవి కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు మీదకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే మాటువేసిన సాయి ఆమెపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలి మెడ, నడుము భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. దాడి అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నించిన ప్రేమోన్మాదిని స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం భార్గవి ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story