డాక్టర్లకే షాక్.. బిడ్డ పుట్టిన 11 వారాలకే..

డాక్టర్లకే షాక్.. బిడ్డ పుట్టిన 11 వారాలకే..

ప్రపంచంలో ఎన్నో వింతలు.. మరెన్నో విశేషాలు.. ఏదో ఒక మూల జరిగే ఏదో ఒక సంఘటన మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. ఒకే కాన్పులో కవలలు జన్మిస్తుంటారు కొన్ని నిమిషాలు లేదా గంటల వ్యవధిలో. కానీ ఉత్తర కజకిస్థాన్‌కు చెందిన లిలియా కోనోవలోవా మొదట మే 24వ తేదీన కూతురు పుట్టింది. 11 వారాల అనంతరం ఆగస్ట్ 9న మరో బాలుడు జన్మించాడు. లిలియాకు మొదటి బిడ్డ ఆమె గర్భం దాల్చిన 25 వారాలకే 822 గ్రాముల బరువుతో పుట్టింది. మళ్లీ 11 వారాల వ్యవధిలో పుట్టిన బాబు 2.89 కిలోల బరువున్నాడు. ఇలా వారాల వ్యవధిలోనే బిడ్డకు జన్మనివ్వడానికి కారణం రెండు గర్భాశయాలను కలిగి ఉండడమేనని వైద్యులు నిర్ధారించారు. దీన్నే వైద్య పరిభాషలో డిడెల్పిస్‌గా వ్యవహరిస్తారు. అందుకే రెండు గర్భాశయాల్లో శిశువులు వేర్వేరు సమయాల్లో అభివృద్ధి చెందడం జరుగుతుంది. అయితే ఇలాంటి కేసులు చాలా అరుదుగా చూస్తుంటామని కేవలం 50 మిలియన్లలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. తనకు రెండు గర్భాలు ఉండడమే ఆశ్చర్యమనుకుంటే ఇలా వారాల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టడం ఇంకా కలగానే అనిపిస్తుందని లిలియా అంటోంది. అయితే పుట్టిన పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉండడం సంతోషాన్నిచ్చే విషయమని లిలియా కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story