కీచక టీచర్‌కు దేహశుద్ధి

కీచక టీచర్‌కు దేహశుద్ధి
X

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు పిల్లలపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తప్పు చేస్తే దండించాల్సినే టీచరే తప్పుగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించి ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చాడు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ ఆ కీచక టీచర్‌కు దేహశుద్ధి చేశారు. వరంగల్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.

మట్టెవాడ ప్రభుత్వ పాఠశాలలోని చిన్న పిల్లలతో శ్రీనివాస్‌ అనే టీచర్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విషయం పేరెంట్స్‌కు తెలియడంతో స్కూల్‌కు వచ్చి శ్రీనివాస్‌ను నిలదీశారు. దురుసుగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు.. శ్రీనివాస్‌పై చేయిచేసుకున్నారు. అతడిని తక్షణం విధుల నుంచి తొలగించాలని పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story