తల్లీబిడ్డ ప్రాణం తీసిన ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

తల్లీబిడ్డ ప్రాణం తీసిన ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం ఓ గర్భిణితో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు ప్రాణం తీసింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో జరిగింది. మొగుళ్లపల్లి మండలం ఎస్‌పేట గ్రామానికి చెందిన కవిత.. డెలివరీ కోసం సోమవారం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అయితే గైనకాలజిస్ట్‌ లేకుండానే ఆస్పత్రి సిబ్బంది.. నార్మల్‌ డెలివరీ కోసం ఆమెను రూంకు తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కవితతో పాటు ఆమె కడుపులోని శిశువు చనిపోయింది.

కవిత మృతితో ఆమె బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే తల్లీబిడ్డ ప్రాణం తీసిందంటూ హాస్పిటల్‌ అద్దాలు పగులగొట్టారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. గైనకాలజిస్ట్‌ లేకుండా వైద్యం చేయడానికి ప్రయత్నించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కవిత బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story