ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? కనీసం ఊహకు కూడా అందడం లేదా! అందులో ఉన్నది ఎవరో కాదు దేశం గర్వించదగ్గ ప్రముఖ క్రీడాకారులు ఒకరు పరుగుల రాణి పీటీ ఉష అయితే మరొకరు బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు. తాజాగా ఈ ఫోటోకు సంబంధించిన అనుభవాన్ని ఉష ట్విట్టర్ ద్వారా అభిమానులతో కలిసి పంచుకున్నారు. అది 2001.. ఆ సమయంలో హైదరాబాద్‌లో ఆలిండియా రైల్వే స్పోర్ట్స్‌ మీట్‌ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా నేను హాజరయ్యాను. ఆ సమయంలో సింధు తండ్రి రమణ మంచి వాలీబాల్‌ ప్లేయర్. ఆ రోజు సింధు వాళ్ళ ఫ్యామిలి నాకు ఆతిథ్యం ఇచ్చింది. సాధారణంగా నేను అలా ఎవరి ఇళ్లల్లోనూ ఉండను కానీ ఆ ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి హోటల్స్‌లో కాకుండా, సింధు వాళ్ల ఇంట్లో ఉన్నా.. అప్పుడు సింధు చాలా చిన్న అమ్మాయి. బొద్దుగా, అమాయకంగా ఉండేది. నాతో ఆడుకుందని ఉష అన్నారు.

చాలా రోజుల తర్వాత అంటే 2016 నాటి ఒలింపిక్స్‌ లో సింధు గెలిచిన తర్వాత రమణ నాకో ఫొటో పంపించారు. అందులో ఉన్నదెవరో గుర్తుపట్టారా! అని అడిగారు. ఎందుకు గుర్తులేదు.. బాగా గుర్తుంది అని అన్నాను. అది 2001లో సింధుతో కలిసి దిగిన ఫోటో. ఇప్పటికీ ఆ ఫోటోని గుర్తుగా సేవ్‌ చేసి ఉంచుకున్నా. సింధు నాకు ఎప్పటికీ చిన్న పిల్లలానే కనిపిస్తుంది. ఒలింపిక్స్‌ రజితం సాధించిన ఆమెకు 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించే సత్తా ఉంది. సింధూ... ఆల్‌ ది బెస్ట్‌ అంటూ చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story