85 ఇయర్స్.. 7000 వికెట్స్.. నాటౌట్

85 ఇయర్స్.. 7000 వికెట్స్.. నాటౌట్
X

వయసుతో పనేముంది.. ఒంట్లో సత్తా వుండాలి కానీ.. అందరికీ వర్తిస్తుందా.. అమృతం తాగిన మహానుభావులు కొందరే వుంటారా.. వెస్టిండీస్ క్రికెటర్‌ సెసిల్ రైట్.. ఆయన వయసు 85 ఏళ్లు. 60 ఏళ్లుగా కెరీర్‌లో 7000కు పైగా వికెట్లు తీశారు. ఫాస్ట్ బౌలర్‌గా క్రికెట్ మైదానంలో దుమ్ము రేపారు. సెసిల్ వెస్టిండీస్ దిగ్గజాలు వివ్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, జోయెల్ గార్నర్, ఫ్రాంక్ వోరెల్‌తో కలిసి ఆడారు. 85వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఆటకు దూరమవుతున్నానని ప్రకటించారు. సెసిల్ మొదట బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో జమైకాకు ప్రాతినిధ్యం వహించారు. 1959లో ఇంగ్లాండ్ వెళ్లి సెంట్రల్ లాంకాషైర్‌కు ఆడారు. ఎనిద్‌ను పెళ్లి చేసుకుని ఆయన అక్కడే స్థిరపడ్డారు. ఒకానొక సమయంలో ఐదు సీజన్లలో 538 వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. అంటే దాదాపు 27 బంతులకు ఒక వికెట్ పడగొట్టినట్టు. ఇంత సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్‌ని సాగించడానికి కారణం తన ఆరోగ్యమే అంటారాయన. ఆహార పరిమితులు పెద్దగా ఏం లేవని చెబుతూ నచ్చింది తినేస్తానంటారు. అప్పుడప్పుడు బీర్ తాగుతారు. ఎప్పుడు ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. ఈ మధ్య వయసు కారణంగా ప్రాక్టీస్‌కి వెళ్లట్లేదన్నారు. సెప్టెంబర్ 7న జరిగే పెన్నీ లీగ్‌లో అప్పర్‌మిల్ తరపున స్పింగ్‌హెడ్‌పై మ్యాచ్ ఆడి సెసిల్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతారు.

Tags

Next Story