మా ఆయన మందు కొట్టమంటున్నాడు.. అందుకే..

మా ఆయన మందు కొట్టమంటున్నాడు.. అందుకే..

పేరుకి సాప్ట్‌వేర్.. కానీ పక్కా హార్డ్‌వేర్. లేకపోతే పెళ్లయిన కొత్తలో ప్రేమా దోమా అంటూ కొంగు పట్టుకు తిరిగేవాడు కాస్తా పెళ్లయిన కొద్ది రోజులకే ప్రేమ తగ్గిపోయి ముద్దుగా బొద్దుగా ఉన్నావనే వాడు కాస్తా.. మరీ అంత లావుగా వుంటే ఎలా అంటూ నా శరీరంపై సెటైర్లు వేస్తున్నాడు. ఇప్పుడేమో తనతో కలిసి మందు కొట్టమంటున్నాడు. అందుకే నాకొద్దీ మొగుడు విడాకులు ఇప్పించండి అంటూ కోర్టుకెక్కింది ఓ ఇల్లాలు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఘజియాబాద్‌కు చెందిన యువతికి మీరట్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగితో 2014లో వివాహం అయింది. కొద్దిరోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత లావుగా ఉన్నావంటూ భార్యను వేధించడం ప్రారంభించాడు. భార్య లావుగా ఉందనే కారణంతో.. ఎక్కడికి తీసుకెళ్లే వాడు కాదు. ఇక ఇంటికి ఎవరైనా బంధువులు, ఫ్రెండ్స్ వస్తే వారి ముందే ఆమెను అవమానించేవాడు. అంతటితో ఊరుకోలేదు ఆ నీచుడు.. తనతో కలిసి మద్యం సేవించాల్సిందిగా భార్యను బలవంతం చేసేవాడు. అందుకు ఆమె అంగీకరించకపోతే తీవ్రంగా కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన మహిళ భర్త పెట్టే టార్చర్‌ను తట్టుకోలేక పోతున్నాను.. విడాకులు ఇప్పించండి అంటూ ఘజియాబాద్‌ కోర్టును ఆశ్రయించింది.

Tags

Read MoreRead Less
Next Story