క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్ సంచలన వ్యాఖ్యలు

క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్ సంచలన వ్యాఖ్యలు

క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేశారు నటి పాయల్ రాజ్‌పుత్. మీటూ ఉద్యమం జరిగినప్పటికీ, క్యాస్టింగ్‌ కౌచ్‌ ఇంకా నశించలేదని చెప్పారు. ఆర్‌ఎక్స్‌- 100 రిలీజ్‌ తర్వాత క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. హిందీలో లో సీరియళ్లు, పంజాబీలో సినిమాలు చేసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పుకొచ్చింది పాయల్. అవకాశాల పేరుతో లైంగిక కోరికలు తీర్చమని చాలా మంది అడిగేవారని.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయేమోనని చెప్పింది బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో ఒక్కసారిగా ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది పాయల్. ప్రస్తుతం తెలుగులో వెంకటేశ్‌ సరసన వెంకీమామ, రవితేజతో డిస్కో రాజా, తేజాస్‌ ఆర్‌డిఎక్స్‌ లవ్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఓ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గానూ కనిపించనున్నారు. చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్న పాయల్‌ రాజ్‌పుత్‌, ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడారు.

ఆర్‌ఎక్స్‌- 100లో బోల్డ్‌ సన్నివేశాల్లో నటించడంతో.. బయట కూడా అలాగే ఉంటానని కొంత భావిస్తున్నారని చెప్పింది పాయల్. సినిమా అవకాశాల కోసం నిజ జీవితంలో ఏమైనా చేస్తానని అనుకుంటే ఎలా? అని ప్రశ్నించింది. అవకాశాలు ఇస్తే లైంగిక వాంఛలు తీర్చాలన్న పద్ధతికి తాను పూర్తి వ్యతిరేకం అన్నారు. కేవలం సినిమా రంగంలోనే కాదు, ఇతర రంగాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్‌ ఉందని స్పష్టం చేశారు పాయల్. ధైర్యంగా మాట్లాడటం వల్ల కొందరు తనతో సినిమాలు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story