భారత యువతి ప్రేమలో పడ్డ ఆసీస్ క్రికెటర్

ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రేమలో పడ్డాడు. ఓ భారతీయ యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి అక్కడి వీధుల్లో తెగ తిరిగేస్తున్నారు. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన విని రామన్ అనే అమ్మాయి మ్యాక్స్‌వెల్ తో ప్రేమలో పడింది. మ్యాక్స్‌వెల్ గ్రౌండ్‌లో ఎంతటి విశ్వరూపం చూపిస్తాడో బయట అంతటి రొమాంటిక్ హీరో. అయితే వీరి వివాహం ఎప్పుడనేది మాత్రం ఇంత వరకు స్పష్టత రాలేదు. భారతీయ యువతులను పెళ్ళాడడం ఆసీస్ క్రికెటర్లకు ఇది మెుదటిసారేమీ కాదు. ఇంతకు ముందు ఆసీస్ పేసర్ షాన్ టైట్ భారత యువతినే పెళ్లాడాడు. ఐపీఎల్ 2014 సమయంలో ఓ వేడుకలో పరిచయమైన మషూమ్ సింఘా అనే యువతితో ప్రేమలో పడ్డ టైట్, ఆ తర్వాత ఇరువురు వివాహం బంధంతో ఒక్కటయ్యారు.
మ్యాక్స్‌వెల్‌కు ప్రపంచ క్రికెట్ అభిమానుల గుండెల్లో ఓ మంచి స్థానం ఉంది. ఆసీస్ టీమ్‌లోనే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని డాషింగ్ బ్యాటింగ్‌ను అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేసారు. అయితే మాక్స్ ఫామ్‌లో లేక సతమతమవుతున్నాడు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్‌లోనూ మాక్స్ పెద్దగా రాణించలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్‌లో మాత్రం చేలరేగి ఆడుతున్నాడు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com