తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-10, బీ-1 బోగీల్లో మంటలు చెలరేగాయి. రైలు ఉత్తరప్రదేశ్‌లోని బల్లభ్‌గఢ్‌ వద్దకు రాగానే దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలును బల్లభ్‌గఢ్‌ వద్ద నిలిపివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైలు నిలిచిపోవడంతో ఈ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై విచారణ చేపట్టారు రైల్వే అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story