అమ్మా ఐ లవ్యూ.. హీరోయిన్ భావోద్వేగం

అమ్మా ఐ లవ్యూ.. హీరోయిన్ భావోద్వేగం

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు కష్ట కాలంలో ఉంది. తను నటిస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండడంతో పాటు తాజాగా తన బాయ్ ఫ్రెండ్‌తో విడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చేలా ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుండి డిలీట్ చేసింది. వీళ్లిద్దరూ నిజంగానే విడిపోయి ఉంటారని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే తన తల్లితో చిన్నప్పుడు దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేసి ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. 'నువ్వే నా బలం, మై రాక్, నా బలహీనత. నా సర్వస్వం నువ్వే , నాకు నువ్వు విలువైన దానివి అమ్మ.. మిమ్మల్ని పోల్చడానికి ఏ పదాలు సరిపోవు. నా కోసం ఎంతో కష్టపడ్డావు. నీకు ధన్యవాదాలు .. అమ్మా.. ఐ లవ్యూ' అంటూ ఇలియానా ఎంతో భావోద్వేగంతో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌కు గంటల వ్యవధిలోనే 1.5 లక్షల లైక్‌లు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story