ఆకలికి తట్టుకోలేక సింహం ఏం చేసిందో తెలుసా?

జీవితం ఎవరినీ విడిచి పెట్టదు అని ఓ సినిమా డైలాగ్ అందరికీ వర్తిస్తుంది. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. సమయం అనుకూలిస్తే బంటు.. రాజు అవుతాడు. అదే టైమ్ బావుండకపోతే రాజు కాస్తా బంటు అవుతాడు. ఎంతటి మేథావులైనా, పరాక్రమ వీరులైనా కాలం అనుకూలించినంతవరకే. ఇందుకు నిదర్శనం అడవికి రారాజైన మృగరాజును కూడా కాలం పరీక్షించింది. ఆకలేస్తే మాంసం తినే సింహం గడ్డి తింటోంది. తాజాగా గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో సింహం గడ్డి తింటూ కెమెరాకు చిక్కింది. అడవుల్లో మాంసాహార జంతువులకు సరైన ఆహారం దొరక్క బక్కచిక్కిపోతున్నాయి. ఆకలికి తట్టుకోలేక దొరికింది తినేస్తున్నాయి.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన చాలా మందిని ఆలోచింపచేస్తుంది. మూగ జీవాల అరణ్యరోదనను కళ్ళకు కడుతోంది. సింహాలకు అభయారణ్యమైన గిర్ అడవుల్లో ఏటా భారీ సంఖ్యలో మృగరాజులు మృత్యువాత పడుతున్నాయి. 2016-17 సంవత్సర కాలంలో దాదాపు 200 సింహాలు మృత్యువాత పడ్డాయని ప్రభుత్వ నివేదికలో తేలింది. అయినప్పటికీ అటవీశాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://www.facebook.com/TimesofIndia/videos/919228825106686/
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com