టీడీపీ నేత కూన రవికుమార్‌ ఇంట్లో సోదాలు

టీడీపీ నేత కూన రవికుమార్‌ ఇంట్లో సోదాలు
X

శ్రీకాకుళంలోని కూనరవికుమార్‌ ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు.... ఇంట్లో అణువణువూ సోదాలు చేశారు. డీఎస్పీ శ్రీనివాస చక్రవర్తి నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సెర్చ్‌వారెంట్‌ లేకుండా ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారంటూ రవి కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పినా ...పోలీసులు పట్టించుకోలేదు. చివరికి.... రవి ఇంట్లో లేరని తేలడంతో వెనుదిరిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూనరవి సతీమణి ప్రమీల. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, స్పీకర్‌ ఒత్తిడి మేరకే తమను వేధిస్తున్నారంటూ ఆరోపించారు.

Tags

Next Story