డాక్టర్లు షాక్.. ఆమె కడుపు నుంచి తీస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా..

డాక్టర్లు షాక్.. ఆమె కడుపు నుంచి తీస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా..
X

రోజూ తినే తిండే కాస్త ఎక్కువైతే అమ్మా అయ్యా అంటూ ఆపసోపాలు.. తిన్నది అరిగిందాకా తిక్కతిక్కగా ఉంటుంది. తింటే ఆయాసం.. తినకపోతే నీరసం అని ఊరికే అన్లేదు.. ఊరిస్తున్నాయి కదా అని లాగించేస్తే ఇలానే ఉంటుంది అని అనుకోవడం పరిపాటి. మరి బంగారం చూస్తే పెట్టుకోవాలనిపిస్తుందేమో కానీ ఇలా తినాలనిపించడం ఏంటి తల్లీ అని డాక్టర్లు కూడా విస్తుపోయారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం ఇంట్లో నగలు పోతున్నాయి ఎవరు తీస్తున్నారో అర్థం కావట్లేదు. ఆభరణాలతో పాటు కాయిన్స్ ‌కూడా మాయమవుతున్నాయి. ఎవర్ని అనుమానించాలో కుటుంబ సభ్యులకు అంతుపట్టలేదు.

ఇదిలా ఉండగా ఓ రోజు ఇంట్లోని 26 ఏళ్ల యువతికి విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. బాధ భరించలేక మెలికలు తిరిగిపోయింది. కుటుంబసభ్యులు హుటాహుటిన రాంపూర్‌హత్ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్లర్లు నొప్పి తగ్గడానికి మందులిచ్చినా ఫలితం లేదు. దాంతో టెస్టులన్నీ చేశారు. పొట్ట స్కానింగ్ తీశారు. ఆ రిపోర్టులు చూసి డాక్టర్లు షాకయ్యారు. వెంటనే సర్జరీ చేయాలి లేకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం అన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో డాక్టర్లు సర్జరీకి ఏర్పాట్లు చేశారు. నలుగురు డాక్టర్ల బృందం కలిసి ఆమెకు సర్జరీ చేసింది.

కడుపులో నుంచి ఒక్కొక్కటిగా నగలు, నాణేలు తీయడం మొదలు పెట్టారు. తీస్తున్నకొద్దీ వస్తున్నాయి. అలా ఏకంగా కిలోన్నర నగల్ని బైటకు తీశారు. ముక్కుపుడకలు, చెవిపోగులు, బ్రేస్‌లెట్లు, కాయిన్స్.. ఇవన్నీ పేర్చుకుంటూ పోయిన డాక్టర్లు.. ఎలా తిన్నావమ్మా అంటే సమాధానం చెప్పలేకపోయింది. బలపాలు, చాక్‌పీసులు తిన్నారంటే కడుపులో పురుగులు వుండి వాటికి ఆహారం కోసం తినాలనిపిస్తుంటుంది అందుకే వాటిని తింటారని డాక్టర్లు చెబుతుంటారు. మరి ఈ బంగారం తినే గోలేంటో అని డాక్టర్లు సైతం విస్తుపోయారు. మొత్తానికి కడుపంతా క్లీన్ చేసి మింగిన బంగారం మొత్తాన్ని బయటకు తీశారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని క్రమంగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.

Tags

Next Story