ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్‌

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్‌
X

ఇసుకపాలసీని ప్రకటించని ప్రభుత్వ తీరును నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేతలు నిరసనల్లో పాల్గొనేందుకు ప్రయత్నించారు. అంతకుముందే టీడీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడును గృహనిర్బంధం చేశారు. దుగ్గిరాలలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఇంట్లో నిర్బంధించారు. దీంతో ప్రభాకర్‌ ఇంటి వద్ద పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Next Story

RELATED STORIES