మూడేళ్ల చిన్నారి కిడ్నాప్

X
తిరుపతి నగరంలోని భూమా థియేటర్ వద్ద మూడేళ్ల చిన్నారిని కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేశారు. భూమా సినీ కాంప్లెక్స్‌లో పనిచేస్తోన్నపవన్,రేణుకల మూడేళ్ల కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే.. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు 5 గంటల్లోనే చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించారు. పోలీసులు తమ కోసం వెతుకులాట ప్రారంభించిన నేపథ్యంలో.. కిడ్నాపర్లు చిన్నారిని రోడ్డు మీద వదిలిపెట్టి పరారయ్యారు. చిన్నారి భాగేశ్వరిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పజెప్పారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ సురక్షితంగా ఇంటికి చేరడంతో చిన్నారి తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. సిసి కెమెరాల ద్వారా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
