ఎలుగుబంటి ఎమోషన్.. ఈ వీడియో చూస్తే మీరు శభాష్ అనాల్సిందే

ఎలుగుబంటి ఎమోషన్..  ఈ వీడియో చూస్తే మీరు శభాష్ అనాల్సిందే

ఎమోషన్స్ మనుషులకే కాదు నోరు లేని మూగ జీవాలకు కూడా ఉంటాయి. కష్టాల్లో ఉన్న తోటివారిని రక్షించాలనే తాపత్రయం వాటికీ ఉంటాయి. ఇలాంటి ప్రయత్నాన్ని మనం ఎక్కువగా శునకాల్లో చూశాం. అయితే తాజాగా రెండు ఎలుగుబంట్లు చెత్త డంప్‌లో చిక్కుకుపోయిన మరో ఎలుగు బంటిని కాపాడడం కోసం చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంటుంది. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంతకీ వీడియోలో ఏముందంటే..

డంప్‌స్టర్‌లో చిక్కుకున్న ఓ చిన్న ఎలుగుబంటిని రక్షించడానికి తన తల్లి, తోబుట్టువు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అంతలో పోలీసుల పెట్రోలింగ్ వాహనం అక్కడి రావడంతో అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాయి. అప్పటివరకు వాటి పాట్లును చూసిన పోలీసులు డంప్‌స్టర్‌లో ఉన్న ఆ బుజ్జి ఎలుగుబంటిని గమనించి రక్షించారు. ఓ నిచ్చెనను డంప్‌స్టర్‌లో ఉంచి అక్కడి నుంచి దూరంగా వెళ్లారు. అందులో ఉన్న ఆ చిన్న ఎలుగుబంటి నిచ్చెన సహాయంతో లోపల నుంచి బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి దూరంగా ఉన్న తన తల్లి, తోబుట్టువు దగ్గరకు పరిగెత్తింది. తర్వాత అవి మూడు కలిసి అడవిలోకి పారిపోయాయి. ఈ సంఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయింది.

ఈ సంఘటన కాలిఫోర్నియా చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ప్లేసర్‌ కంట్రీ షెరిఫ్‌ ఆఫీసు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. నెటిజన్స్ వాటి ప్రయత్నాన్ని చూసి ఫిదా అవుతున్నారు. జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. సూపర్‌ క్యూట్‌ బేర్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Tags

Next Story