లీగల్‌గా ముందుకెళతా : సుజనా చౌదరి

ముంపు తర్వాత రోజుకో వివాదంలో మునుగుతోంది ఏపీ రాజధాని. రాజధాని తరలింపు గందరగోళానికి తెరతీసిన మంత్రి బొత్స సత్యనారాయణ..ఆ తర్వాత టీడీపీ నేతలపై మరో పిడుగు పేల్చారు. బినామీ పేర్లతో రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్నారని ఆరోపించారాయన. ఖచ్చితంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారాయన.
బొత్స ఆరోపణలపై టీడీపీ ఎదురుదాడికి దిగింది. లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ ఇప్పటికే తనపై బొత్స చేసిన ఆరోపణలపై ఎదురుదాడికి దిగారు. ఇక ఇప్పుడు సుజనా చౌదరి.. బొత్స ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. బొత్స ఆరోపిస్తున్నట్లుగా బినామీల ద్వారా భూములు కొనాల్సిన అవసరం తనకు లేదన్నారు.. ఈ అసత్య ఆరోపణలపై లీగల్‌గా ముందుకెళతానని చెప్పారు సుజనా చౌదరి.
అసలు 2013 తర్వాత రాజధాని ప్రాంతంలో తాను భూములే కొనలేదని చెబుతున్నారు కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి. ఏపీలో ఆర్ధిక వ్యవస్థ కుదేలైపోయిందన్నారు. విజయసాయి సలహాలు తీసుకుంటే జగన్ ఇబ్బంది పడుతారని అభిప్రాయపడిన సుజనా చౌదరి.. అమరావతి మార్పుపై తనకు సమాచారం లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com