ప్రేమతో భార్య ప్రాణాలు తీసిన భర్త.. చివరకు తను కూడా..

ఓ భర్త.. భార్య అవస్థను చూడలేక ఆమెకు ఈ లోకం నుంచి శాశ్వత విముక్తి కల్పించాడు. చివరకు తను కూడా తనువు చాలించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో చోటుచేసుకుంది, గణేష్ అనే వ్యక్తి పూణేలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య వృశాలి గత కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధ పడుతోంది. ప్రాణంగా ప్రేమించిన భార్య పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయిన గణేష్ భార్య వృశాలిని చంపి తానూ చనిపోవాలని భావించాడు. మెుదటగా సుత్తితో భార్య తలపై బలంగా కొట్టి ప్రాణాలు తీశాడు. తర్వాత గణేష్ కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు వదిలేశాడు.
సంఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "ప్రాణంగా ప్రేమించిన నా భార్య వేదనను చూడలేక తనకు ఈ లోకం నుంచి విముక్తి కలిగించాను" అని దానిలో రాశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com